ETV Bharat / state

పేదల పాలిట వరం.. ఆలేరు డయాలసిస్ కేంద్రం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

యాదాద్రి భువనగిరి జిల్లాలో మూత్రపిండ సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు డయాలసిస్ కోసం గతంలో హైదరాబాద్, వరంగల్ నగరాలకే వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఆ అవస్థకుతోడు ఆర్థిక భారం పడేది. బాధితులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయాయి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆలేరులోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్తు ఆస్పత్రిలో ఏర్పాటైన భగవాన్ మహావీర్ డయాలసిస్ కేంద్రం(బీఎండీసీ) ఏడాది నుంచి యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలకు చెందిన బాధితులకు మెరుగైన సేవలు అందిస్తోంది.

aler dialysis centre, mla gongidi sunitha
ఆలేరు డయాలసిస్ కేంద్రం సేవలు, ఎమ్మెల్యే గొంగిడి సునీత చొరవ
author img

By

Published : Jul 24, 2021, 12:49 PM IST

Updated : Jul 24, 2021, 3:23 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో డయాలసిస్ కేంద్రం సేవలు ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలోని మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రత్యేక దృష్టి సారించి "హీల్" స్వచ్ఛంద సంస్థ, జేఎస్ఆర్ గ్రూపు సహకారంతో సుమారు రూ.40 లక్షల ఖర్చుతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అత్యాధునిక రీతిలో భవనాన్ని నిర్మించారు. అవసరమైన వసతులూ సమకూర్చారు

మూడు విడతల్లో సేవలు

భగవాన్ మహవీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్ కలిసి డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది జూన్ 28న ప్రారంభమైన ఈ కేంద్రంలో పది పడకలు ఉన్నాయి. పదిమంది సిబ్బంది పనిచేస్తున్నారు. రోజుకు మూడు విడతల్లో పది మంది చొప్పున 30 మంది రోగులకు ఉచితంగా సేవలందిస్తున్నారు. కేంద్రం నిర్వహణ అంతా భగవాన్ మహవీర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే సాగుతోంది.

పేదలకు ఉచితం..

మూత్రపిండ సంబంధిత వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకోవాలంటే ఆస్పత్రుల స్థాయిని బట్టి ఒకసారికి రూ.2,500 నుంచి రూ.5వేల వరకు ఖర్చవుతుంది. తీవ్రతను బట్టి ఒక రోగి నెలలో ఒకటి నుంచి ఆరుసార్లు డయాలసిస్ చేయించుకుంటారు. రవాణా ఖర్చులు ఒక్కోసారి సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు అయ్యేది. వైద్యం, రవాణా ఖర్చు భారంతో బాధితులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటివారికి ఈ డయాలసిస్ కేంద్రం ద్వారా ఉచిత సేవలు అందుతున్నాయి. రవాణా ఛార్జీల భారం తగ్గింది. గులాబి రంగు రేషన్ కార్డు ఉన్న రోగులకు మాత్రమే నామమాత్రంగా రూ.400 రుసుం తీసుకుంటున్నారు. తెలుపు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కార్డులున్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోండి

'మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల బాధలు విని చలించిపోయాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో భవనాన్ని నిర్మించాం. ఆధునాతన వైద్య పరికరాలతో ఈ డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోంది. పేదలు ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి.'

-గొంగిడి సునీత, ఆలేరు ఎమ్మెల్యే

సంతోషంగా ఉంది

'ఇక్కడ డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది. సిబ్బంది చాలా బాగా మెరుగైన సేవలందిస్తున్నారు. వ్యాధిగ్రస్తులను చాలా బాగా చూసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చుట్టూ గ్రామాల నుంచి చాలామంది బాధితులు వస్తున్నారు. ఇదివరకు హైదరాబాద్‌, వరంగల్ నగరాలకు వెళ్లేవాళ్లం. ఆ ఖర్చు భరించే శక్తి ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఒకరు తోడుగా రావడం తప్పనిసరి. ఇప్పుడు ఒక్కరమే వచ్చి చికిత్స తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలందిస్తున్నారు. ఈ కేంద్రాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. దీనిని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.'

-మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు

ఆలేరు డయాలసిస్ కేంద్రం సేవలు

ఇదీ చదవండి: RTC BUS: రోడ్డుపైకి కాలం చెల్లిన బస్సులు... ఆందోళనలో ప్రయాణికులు

Last Updated : Jul 24, 2021, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.