ETV Bharat / state

యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం - ధనుర్మాస ఉత్సవాల ప్రారంభం

శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా 30 రోజుల పాటు వేకువజామున తిరుప్పావై పాశురాల పఠనం నిర్వహించున్నట్టు యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.

dhanurmasa celebrations started at yadadri laxminarsimha swamy temple
యాదాద్రి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
author img

By

Published : Dec 16, 2020, 6:45 AM IST

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం ధనుర్మాసం-దక్షిణాయ చివర, ఉత్తరాయణ ముందు... ప్రాతః కాలమని హైందవ సంస్కృతి చెబుతోంది. ఈ మాసంలో భగవంతుడిని తులసి మాలతో నిత్యారాధన చేస్తే శుభం కలుగుతుందంటున్నారు పండితులు. భక్తి పర్వంతో సహా పొంగలి, దద్దోజనం వంటి పదార్థాల నివేదన చేయడం వైష్ణవ ఆలయాల ఆచారం. ఆ క్రమంలోనే పంచ నారసింహులతో విరాజిల్లుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం ధనుర్మాస ఉత్సవాలకు వేదికైంది.

ఈ మాసం వచ్చిందంటే వణికించే చలిలో సూర్యోదయానికి ముందస్తే పెళ్లి కాని యువతులు, మంగళహారతులతో ఆలయానికి చేరుకుని గోదాదేవిని స్తుతిస్తూ నివేదిస్తారు. శ్రీ రంగనాథుడిని కళ్యాణమాడేందుకు గోదాదేవి తాను రచించిన తిరుప్పావై పాశురాలను పఠిస్తూ తన ప్రేమాయణాన్ని కొనసాగిస్తుంది. రంగనాథుడిని ప్రణయమాడే పర్వాన్ని సంక్రాంతి సంబరాల్లో చేపడతారు. ప్రేమానురాగాలకు నెలవైన ధనుర్మాసం తొలిరోజు గోదాదేవి పాశుర పఠనంతో స్వామిని సేవిస్తుంది. తొలిరోజు చేపట్టే నోమును సిరినోము అంటారు. గుమ్మడి, ఆనప, గొంగళి, తెల్లని వస్త్రం, బియ్యం దానం చేస్తే శుభదాయకమని పురాణాలు చెబుతున్నాయి.

ఈ మాసం వచ్చే సంక్రాంతి పర్వంతో ముగుస్తుందని యాదాద్రి ఆలయ పూజారులు తెలిపారు. ప్రతినిత్యం వేకువజామున తిరుప్పావై పఠనంతో ఉత్సవాలను నిర్వహిస్తారు. నాలుగు వేదాల సారాంశాన్ని అమ్మవారు లోకానికి చాటిన తిరుప్పావై పాశురాల పఠనాన్ని 30 రోజులు నిర్వహించనున్నట్టు చెప్పారు.

ఇదీ చూడండి: ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల సీజేల బదిలీ...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.