యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం పైగా ఆదివారం కావడంతో సందడి నెలకొంది. స్వామివారి దర్శన సమయానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది. లఘు దర్శన సౌకర్యాన్నీ ఆలయ అధికారులు కల్పిస్తున్నారు. సత్యనారాయణ వ్రత మండపం కిటకిటలాడుతోంది. భక్తులు కుటుంబ సమేతంగా వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ అనంతరం ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్డు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణ మండపం, దర్శన క్యూ లైన్లు, కల్యాణ కట్ట, వసతి గృహాల సముదాయం వద్ద రద్దీ నెలకొంది. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్ని నియంత్రించారు.
ఇదీ చదవండి: వెండితెరపై ప్రపంచ ఛాంపియన్ ఆనంద్ బయోపిక్