ETV Bharat / state

Yadadri temple: 'లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ సింహాసనం సిద్ధం'

Yadadri temple: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఖజానాలో మరో వస్తువు చేరింది. స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణంలో ఉపయోగించేందుకు వీలుగా అమెరికా నుంచి వచ్చిన భక్తుడు స్వర్ణ సింహాసనం సమర్పిచారు. రూ.18లక్షల విలువైన బంగారంతో ఈ సింహాసనాన్ని తయారు చేయించారు.

స్వర్ణ సింహాసనం
స్వర్ణ సింహాసనం
author img

By

Published : Jun 19, 2022, 4:36 PM IST

Yadadri temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోస్వామి, అమ్మవార్లకు జరిగే నిత్యకల్యాణోత్సవానికి బంగారు సింహాసనం సిద్ధమైంది. ధగధగ మెరిసే ఈ సింహాసనం ఇకనుంచి స్వామివారికి జరిపే నిత్యకల్యాణ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సుమారు 18 లక్షల విలువ చేసే బంగారు పూతతో ఈ కళ్యాణ సింహాసనాన్ని సిద్ధం చేయించారు. సామల వీరమణి, స్వామి దంపతులు ఆలయానికి బహుకరణగా అందజేశారు. బంగారు సింహాసనాన్ని అందుకున్న ఆలయ ఈవో.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మండపంలో ఈ స్వర్ణ సింహాసనంపై ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రతినిత్యం జరిపే నిత్య కల్యాణ క్రతువును వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి పునర్​నిర్మాణం అనంతరం.. స్వామివారికి పలువురు కానుకల రూపంతో తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇటీవలే స్వామివారికి బంగారు యజ్ఞోపవీతం అందజేశారు.

లక్ష్మీనరసింహస్వామికి స్వర్ణ సింహాసనం సిద్ధం

ఇదీ చదవండి: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. ధర్మదర్శనానికి 2 గంటల సమయం

సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. జీతం రూ.60 వేలకుపైనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.