యాదాద్రి కొండకింద నాలుగేళ్ల క్రితం రూ.2 కోట్ల వ్యయంతో తులసీ కాటేజీలో నిర్మించిన బోటింగ్ పార్క్‌ను కూల్చివేస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉందని దీనిని తొలగిస్తున్నారు.
బోటింగ్ పార్క్ నిర్వహణకు టెంటర్లు పిలిచి బాధ్యతలు అప్పగించారు. రూ.25 చెల్లిస్తే పార్క్‌లోకి ప్రవేశం కల్పించారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు, చిన్న పిల్లలు చాలా మంది పార్క్‌లో బోటింగ్ చేసేవారు. చిన్న పిల్లల పార్క్‌లో పిల్లలు ఆడుకోవడానికి ఆటవస్తువులు ఉన్నాయి. గతేడాది కురిసిన వర్షానికి బోటింగ్ పార్క్‌లోకి మట్టి కొట్టుకురావడంతో కూరుకుపోయింది.
తాజాగా యాదాద్రి వలయ రహదారి, కొండపైకి నూతనంగా నిర్మించనున్న క్యారేజ్ వే బ్రిడ్జిలకు అడ్డుగా ఉందని ఈ పార్కును తొలగించాలని నిర్ణయించి పనులు ప్రారంభించారు.