ETV Bharat / state

'తమ భూములు ఆక్రమించాలనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి' - భువనగిరి బృందావన్​ డెవలపర్స్​ వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వ్యక్తి పేరున పట్టా ఉన్న భూమిని బృందావన్​ డెవలపర్స్​కు చెందిన మన్నెపల్లి మురళీకృష్ణ ఆక్రమించాలని కుట్ర చేస్తున్నారంటూ.. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా సబ్​కలెక్టర్​కు దళిత ఐక్య వేదిక సభ్యులు వినతిపత్రం అందజేశారు.

dailt united vedika members request to take action on brindavan developers team at buvangiri
'తమ భూములు ఆక్రమించాలనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి'
author img

By

Published : Sep 24, 2020, 6:22 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ మండలం గూడూరుకు చెందిన బాలయ్య.. భువనగిరి పట్టణ శివారులో ఎకరా 5 కుంటల భూమిని 2011లో కొనుక్కున్నాడు. తన భూమిని కబ్జా చేసి చంపుతానని బృందావన్​ డెవలపర్స్​కు చెందిన మన్నెపల్లి మురళీకృష్ణ బెదిరిస్తున్నారని.. అతన్ని అరెస్ట్​ చేయాలని బాలయ్య వేడుకున్నారు.

బాలయ్యకు న్యాయం చేయాలని కోరుతూ భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మేరకు అతనిపై చర్యలు తీసుకోవాలని సబ్​కలెక్టర్​ ఉపేందర్​రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. బాధితుని ఫిర్యాదు మేరకు మురళీకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ భుజంగరావు వెల్లడించారు.

ఇవీచూడండి: ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.