యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 25వేల ఎకరాల్లో వరి పంట, 17,600 ఎకరాల్లో పత్తి పంట, 1,250 ఎకరాల్లో కంది, ఏడు వందల ఎకరాల్లో ఇతర పంటలు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ వెల్లడించారు. మూసి పరివాహక ప్రాంతంలో చాలా చోట్ల వరిపంట నీటమునిగింది.
జిల్లాలోని వాగులు, కాల్వలు పొంగగా పరిసర ప్రాంత రైతులు నష్టపోయారు. బీబీనగర్ మండలం చిన్న ఏటి వాగు పొంగగా పరిసర ప్రాంత పంటపొలాలు నీట మునిగాయి. పోచంపల్లి పీఏసీఎస్‌లో ధాన్యాన్ని ఆరబోసిన ఓ మహిళ, వర్షానికి పంట మొత్తం తడిచిపోయిందని కన్నీటి పర్యంతమైంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలే లేవు'