యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రావణి మృతదేహంతో ఆమె బంధువులు గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తే తప్ప అంత్యక్రియలు జరపమని భీష్మించుకు కూర్చున్నారు. బంధువుల ఆందోళనతో సీపీ మహేశ్ భగవత్ బొమ్మల రామారం చేరుకున్నారు. 24 గంటలల్లో నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైతే ఎస్సైను సస్పెండ్ చేస్తామని తెలిపారు. సీపీ హామీతో శ్రావణి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి : అదృశ్యమైన బాలిక మృతదేహం గుర్తింపు