రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా యాదగిరిగుట్ట పీఎస్‌లో పోలీసులు సైతం కరోనా బారిన పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 12 మందికి కొవిడ్ సోకినట్లు గుర్తించారు.
యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, 10 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అందరూ క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించి.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అజాగ్రత్త పనికిరాదని.. అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇదీ చూడండి: ఆగని కొవిడ్ కల్లోలం.. ఆ దేశాల్లో భారీగా కేసులు