ETV Bharat / state

వలస కూలీల్లో కరోనా... ఉలిక్కిపడ్డ గ్రీన్​జోన్​ - coronavirus

యాదాద్రి జిల్లాకు చెందిన వలస కూలీల్లో కరోనా కేసులు క్రమంగా నిర్ధరణవుతుండటం కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు వెళ్లి జిల్లాకు తిరిగివచ్చిన వారిలో ఇప్పటివరకు 16 మంది వైరస్ బారిన పడ్డారు. నాలుగు మండలాలు ప్రభావిత ప్రాంతాలుగా మారగా... ఆయా చోట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

coronal-cases-are-reported-in-yadadri-bhubanagiri-district
వలస కూలీల కరోనా కలకలంతో ఉలిక్కిపడ్డ గ్రీన్​జోన్​
author img

By

Published : May 14, 2020, 4:33 PM IST

గ్రీన్​ జోన్​ పరిధిలో ఉన్న యాదాద్రి జిల్లాలో కరోనా కేసులు కంగారు పెడుతున్నాయి. ముంబయి నుంచి జిల్లాకు తిరిగి వచ్చిన వలస కూలీలు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. నాలుగు మండలాల పరిధిలో 16 మంది కూలీల్లో వైరస్​ బయటపడింది. ఆత్మకూరు(ఎం) మండలంలో 8, చౌటుప్పల్​ పురపాలిక పరిధిలో నాలుగు, సంస్థాన్​ నారాయణపురంలో మూడు, మోటకొండురులో ఒకరి చొప్పున కొవిడ్​ నిర్ధరణ అయింది. వైరస్​ విస్తరించకుండా ఆయా మండలాల్లో పోలీసులు, అధికారులు రక్షణాత్మక చర్యలు చేపడుతున్నారు. అనుమానితుల్లో కొందర్ని ఇప్పటికే హైదరాబాద్, బీబీనగర్ ఎయిమ్స్​ క్వారంటైన్​ కేంద్రాలకు తరలించారు.

బీబీనగర్​ ఎయిమ్స్​కు తరలింపు

ఆత్మకూరు, మోటకొండూరుకు చెందిన వలస కూలీలు మినహా మిగతా వారెవరూ జిల్లాలోకి ప్రవేశించలేదు. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మోటకొండూరు పాజిటివ్ బాధితురాలు... ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో ఈ నెల 9న రాత్రి నాందేడ్ నుంచి వచ్చారు. ఆ నలుగురితోపాటు మరో ముగ్గుర్ని ఈ నెల 10న క్వారంటైన్ తరలించారు. పరీక్షల్లో ఆమె ఒక్కరికే పాజిటివ్ రాగా.. ఆమె కుటుంబ సభ్యులు సహా 13 మందిని బీబీనగర్ ఎయిమ్స్​కు తరలించారు. ఆత్మకూరు మండలానికి సంబంధించి మంగళవారం వరకు 13 మందిని హైదరాబాద్​ తరలించగా.. 8 మందికి పాజిటివ్ వచ్చింది. వారి కాంటాక్టులకు సంబంధించి.. 36 మందిని ఇప్పటికే హోం క్వారంటైన్ చేశారు. తాజాగా మరో 13 మందిని తరలించారు. ఆత్మకూరు నుంచి నలుగురు, ఇప్పల్ల నుంచి ముగ్గురు, కొరటికల్, పారుపల్లి గ్రామాల నుంచి ఇద్దరు చొప్పున, రేగులకుంట, పోతిరెడ్డిపల్లి నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 13 మందిని క్వారంటైన్కు పంపారు.

141 మందికి పరీక్షలు

ఎనిమిది కేసులకు కారణమైన గ్రామాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్... కలెక్టర్ అనితా రామచంద్రన్ సందర్శించారు. భయాందోళనకు గురి కాకుండా కొత్త వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలని...సీపీ, కలెక్టర్ గ్రామస్థులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్ కేంద్రాన్ని వారు పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు 141 మందికి పరీక్షలు చేశారు. ఆత్మకూరు మండలంలోని గ్రామాల్లో వైరస్ కేసులు వెలుగుచూడటం రైతులను అయోమయంలో పడేసింది.. ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. దాదాపు వంద లారీల ధాన్యం అక్కడే ఉండిపోవడంతో... రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: 'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.