యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. 312 మంది విద్యార్థులకు కోవిడ్ టెస్ట్ నిర్వహించగా... 12 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఈ సంఘటనతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల కుటుంబసభ్యులు ఉలిక్కిపడ్డారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి... శానిటైజర్ వాడుతూ పలు జాగ్రతలు పాటించాలని వైద్యాధికారి డాక్టర్ చంద్రారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: నల్లమలలో మరోసారి చెలరేగిన మంటలు