యాదాద్రి భువనగిరి జిల్లాలో పూల రైతులకు నష్టాలే మిగిలాయి. లాక్డౌన్తో పూలన్నీ చెత్త పాలయ్యాయి. పెళ్లిళ్ల సీజన్లో జర్భేరా, కార్నేషన్స్, హైబ్రీడ్ చేమంతికి మంచి గిరాకీ ఉంటుంది. లాక్డౌన్తో వివాహాలతోపాటు అన్ని రకాల శుభకార్యాలు నిలిచిపోవడం వల్ల పూల వాడకం తగ్గింది. జిల్లాలో మొత్తం 132 , ఎకరాల్లో అలంకరణ పూల సాగు చేపట్టారు, పాలీహౌస్ ద్వారా 86 ఎకరాలు, 36 ఎకరాల్లో సాధారణ పద్ధతుల ద్వారా సాగుచేస్తున్నారు వీరంతా ఇప్పుడు వ్యాపారం లేక కష్టాలు ఎదుర్కొంటున్నారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!