ఇన్నాళ్లూ.. ఒక్క కేసు లేకుండా గ్రీన్‌జోన్‌గా కొనసాగుతున్న యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. వైరస్ సోకిన వీరంతా ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు తిరిగి వచ్చినట్లుగా యంత్రాంగం గుర్తించింది. ఆత్మకూరు- (ఎం) మండలంలో ముగ్గురికి, సంస్థాన్ నారాయణపురం మండలంలో ఒకరికి వైరస్ సోకినట్లు... జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ధ్రువీకరించారు.
జిల్లాకు వచ్చిన వారిలో మాత్రమే వైరస్ లక్షణాలు బయటపడటం వల్ల ఆ కేసుల్ని యాదాద్రి జిల్లాలో కలుపుతారా లేదా ఇతర ప్రాంతాలకు చెందుతాయా అన్నది తేలాల్సి ఉందని కలెక్టర్ తెలియజేశారు. రెండు మండలాల్లోని బాధిత పల్లెలపై అధికారులు దృష్టి సారించారు. వైద్యారోగ్యశాఖ బృందాలు... రెండు గ్రామాల్లో సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డాయి.
ఇదీ చూడండి: కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ