యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయం కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారే ప్రమాదం ఉందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగోని రాంచంద్రుడు విమర్శించారు.
రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ఈ చట్టాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయని తెలిపారు. కేసీఆర్, మోదీ రైతు వ్యతిరేకులని ఆయన ఆరోపించారు. నూతన చట్టాలతో కలిగే నష్టాలపై రైతులను చైతన్యవంతులను చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మోత్కూర్ మండల ఉపాధ్యక్షుడు పురుగుల నరసింహ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మలిపెద్ది మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మందుల సురేష్, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, ఉపాధ్యక్షులు అన్నెపు నర్సింహ, రైతులు పాల్గొన్నారు.