ETV Bharat / state

ఆదివారం యాదాద్రికి సీఎం కేసీఆర్​..! - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ముహూర్తం త్వరలో ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానాలయం, సంబంధిత పనులు దాదాపుగా పూర్తైన నేపథ్యంలో సీఎం కేసీఆర్​... ఆదివారం యాదాద్రిలో పర్యటించనున్నారు. పనుల పురోగతిని పరిశీలించి... మిగిలిన వాటికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం మంచి రోజులు లేనందున మే నెల మూడో తేదీ తర్వాతే ముహూర్తం ఉండొచ్చని సమాచారం.

ఆదివారం యాదాద్రికి కేసీఆర్​..!
ఆదివారం యాదాద్రికి కేసీఆర్​..!
author img

By

Published : Feb 24, 2021, 5:10 AM IST

వైభవోపేతంగా నిర్మాణం అవుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు తుదిదశలో ఉన్నాయి. కొండపై ప్రధాన ఆలయానికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. నిర్మాణ పనులన్నీ గతంలోనే పూర్తి కాగా... రెయిలింగ్ ఏర్పాట్లు, శుభ్రం చేయడం, తదితర పనులు చివరి దశలో ఉన్నాయి. లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. స్వామి వారి కైంకర్యాల సామాగ్రిని తీసుకెళ్లేందుకు, అర్చకుల రాకపోకల కోసం ప్రత్యేకంగా లిఫ్టు ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీలకు ప్రత్యేకంగా లిఫ్టును ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు స్వామి వారిని సులువుగా దర్శించుకునేందుకు వీలుగా లిఫ్టు సౌకర్యం కల్పించారు. కొండపై పుష్కరిణి పనులు పూర్తి కాగా... భక్తుల కోసం కొండ దిగువన కూడా పుష్కరిణి సిద్ధమైంది. కల్యాణకట్టను కూడా దీక్షాపరుల మండపంలో సిద్ధం చేశారు. ప్రసాదం కౌంటర్ కూడా కొండపైనే సిద్ధమవుతోంది. ప్రసాదం తయారీ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగిస్తున్నారు. పూర్తిగా యంత్రాల సహాయంతో పరిశుభ్ర వాతావరణంలో ప్రసాదం తయారీ జరిగేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పెరుగుతున్న భక్తుల తాకిడి..

స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పునరుద్ధరణ తర్వాత స్వామి వారి దర్శనానికి ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తే రద్దీ బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. గరిష్ఠంగా రోజుకు లక్ష వరకు భక్తులు రావొచ్చని అంచనావేస్తున్నారు. భక్తుల కోసం రోజుకు పదిలక్షల లడ్డూలు తయారు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలు, ప్రముఖుల విడిది కోసం మరో గుట్టపై ప్రెసిడెన్షియల్ సూట్ సహా 14 కాటేజీలు కూడా సిద్ధమయ్యాయి. ప్రధానాలయం సమీపంలోనే వీఐపీలకు అతిథిగృహం కూడా సిద్ధమైంది. ప్రధానాలయంతో పాటు సంబంధిత పనులన్నీ పూర్తి కావడం వల్ల దర్శనానికి భక్తులకు అనుమతిచ్చేందుకు ఇక సిద్ధమైనట్లేనని అధికారులు చెప్తున్నారు. మిగిలిన కొద్దిపాటి పనులన్నీ కూడా వీలైనంత త్వరగా పూర్తవుతాయని అంటున్నారు.

మే మూడో తేదీ తర్వాతే..!

ఆలయ పునఃప్రారంభానికి సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పనుల పురోగతిని పరిశీలించేందుకు ఆదివారం సీఎం కేసీఆర్​ యాదాద్రిలో పర్యటించనున్నారు. ప్రధానాలయం సహా నిర్మాణ, ఇతర పనులను పరిశీలిస్తారు. అనంతరం చినజీయర్ స్వామిని సంప్రదించి ముహూర్తం ఖరారు చేయవచ్చని అంటున్నారు. మే నెల మూడో తేదీ వరకు మంచి రోజులు లేవని... ఆ తర్వాతే ఆలయ పునఃప్రారంభం ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: మార్చి రెండో వారం నుంచి పెరుగనున్న ఉష్ణోగ్రతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.