ETV Bharat / state

ఉద్రిక్తత... భాజపా, కాంగ్రెస్, వామపక్షాల మధ్య తోపులాట

author img

By

Published : Dec 8, 2020, 2:33 PM IST

యాదాద్రి జిల్లా భువనగిరిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భారత్‌ బంద్‌ నేపథ్యంలో నిరసన తెలుపుతుండగా.. భాజపా, కాంగ్రెస్​, వామపక్షాలకు మధ్య తోపులాట జరిగింది. ఓ దుకాణం మూసివేసే క్రమంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... కార్యకర్తలకు సర్ది చెప్పారు. ఎల్​ఐసీ కార్యాలయాన్ని మూసివేస్తున్న వామపక్ష నాయకులును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

bhongir
భువననగిరిలో ఉద్రిక్తత... కాంగ్రెస్, వామపక్షాల మధ్య తోపులాట

భారత్​బంద్​కు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో కాంగ్రెస్​, తెరాస సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాయి.

భువనగిరిలో నిర్వహించిన భారత్​ బంద్​లో జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్​కుమార్​రెడ్డి పాల్గొన్నారు. బీబీనగర్​ మండలం కొండమడుగు వద్ద తెరాస ఆధ్వర్యంలో హైదరాబాద్​-వరంగల్ జాతీయ రహదారిపై స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి, తెరాస కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

వామపక్షాలు భువనగిరి పట్టణంలో ఓ బేకరి షాప్​ని బంద్​ చేయించే క్రమంలో... రాళ్లు విసరడంతో ఓ రాయి అక్కడే ఉన్న భాజపా కార్యకర్తకు తగలింది. దీనితో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. భాజపా, వామపక్ష కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు వచ్చి మూడు పార్టీల కార్యకర్తలను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించేశారు. భువనగిరి పట్టణంలో ఎల్​ఐసీ కార్యాలయాన్ని మూసివేయిస్తున్న వామపక్ష కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని వ్యాన్​లో పీఎస్​కు తరలించారు. పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.