ETV Bharat / state

CM KCR Yadadri Visit: యాదాద్రిలో కేసీఆర్​ పర్యటన.. పునర్నిర్మాణ పనులపై దిశానిర్దేశం.. - యాదాద్రిఆలయం పునర్నిర్మాణ పనులు

CM KCR Yadadri Visit : ముఖ్యమంత్రి కేసీఆర్​ యాదాద్రిలో పర్యటించారు. హెలికాప్టర్‌లో యాదాద్రి చేరుకున్న సీఎం విహంగవీక్షణం చేశారు. పంచ నారసింహుల దివ్యాలయ ఉద్ఘాటన ఏర్పాట్లను పరిశీలించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు, ఇతర నిర్మాణాల పురోగతిపై మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్షించారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ, మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నా మహా సుదర్శన యాగం ఏర్పాట్లపై సమీక్షించారు.

CM KCR Yadadri Visi, kcr review on yadadri temple
యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
author img

By

Published : Feb 7, 2022, 2:43 PM IST

Updated : Feb 7, 2022, 9:45 PM IST

యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

CM KCR Yadadri Visit : యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహస్వామి ఆలయం పున:ప్రారంభానికి గడువు సమీపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్​ పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం.. విహంగ వీక్షణం చేశారు. హెలికాప్టర్‌ నుంచి యాదాద్రి పరిసరాలను గమనించారు. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం కొండపైకి చేరుకున్న ముఖ్యమంత్రి లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్​కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాలాలయంలో లక్ష్మినారసింహుడికి.. కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా... కార్యనిర్వహణాధికారి ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదం అందజేశారు.

అధికారులకు సీఎం సూచనలు

నారసింహుని దర్శనం అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి.. ప్రధానాలయం, గర్భగుడి, కల్యాణకట్ట, పుష్కరిణి నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు ,ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

పనుల పురోగతిపై రివ్యూ..

కొండ కిందకు చేరుకున్న ముఖ్యమంత్రి.. కల్యాణకట్ట, గండి చెరువు సమీపంలో లక్ష్మి పుష్కరిణి పనులను పరిశీలించారు. మార్చి 21 నుంచి మహాసుదర్శన యాగం నిర్వహించనుండగా.. 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మహాసుదర్శన యాగ స్థలాన్ని ఇప్పటికే చదును చేయగా ముఖ్యమంత్రి పరిశీలించారు. అన్నదానం కాంప్లెక్స్‌, సత్యనారాయణ వ్రతాలు, దీక్షాపరుల మండపాలు, బస్టాండ్‌ పనులు పరిశీలించారు. పుష్కరిణి వద్ద స్నానపుగదుల నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి వలయ రహదారిపై కాన్వాయ్‌ దూసుకెళ్తుండగా చుట్టూ పచ్చదనాన్ని వీక్షిస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగారు. రాష్ట్రపతి తదితర వీవీఐపీల ప్రెసిడెన్షియల్‌ కాటేజీకి వెళ్లారు.

మహాసుదర్శన యాగం పనులపై ఆదేశాలు..

అనంతరం కొండపైకి చేరుకున్న సీఎం.. మహా సుదర్శన యాగం, మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మహా సుదర్శన యాగం పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న యాగశాల డిజైన్లను పరిశీలించారు. యాగశాలలో 126 పర్ణశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పర్ణశాలలో 8 చొప్పున మొత్తం 1,008 హోమగుండాల్లో మహా సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఒక్కో గుండానికి ఆరుగురి చొప్పున దాదాపు 6 వేల పైచిలుకు రుత్వికులు పాల్గొననున్నారు. దేశ విదేశాల నుంచి యాదాద్రి పునఃప్రారంభ వేడుకలకు వచ్చే ప్రముఖులు, అతిథులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, లక్షలాది మంది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపైనా ముఖ్యమంత్రి చర్చించారు. ఆలయ అభివృద్ధి పనులు, ఇతర నిర్మాణాల పురోగతిపై దిశానిర్దేశం చేశారు.

ముగింపు దశకు పనులు

ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలోనే మొదలుకానున్నాయి. యాదాద్రి ప్రధానాలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, బలిపీఠాలకు చేపట్టిన బంగారు తాపడం పనులు చివరి దశలో ఉన్నాయి. కొండపైన ఉత్తరదిశలో రక్షణగోడ, బస్‌బే, దర్శన వరుసలు, స్వాగతతోరణం నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నెలాఖరులోగా పనులన్నీ పూర్తి కాగలవని యాడా అధికారులు చెబుతున్నారు. రెండో కనుమ దారి అనుసంధానం నిర్మాణం తుది దశకు చేరింది. కొండ కింద ఆలయ వనరుల ఏర్పాట్లు చేపట్టారు. పుణ్యస్నానాల కోసం లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణకట్ట, దీక్షాపరుల మండపం, తలనీలాల సమర్పణకు కల్యాణకట్ట నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ పనులన్నీ పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మిగిలిన పనులకు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని యాడా అధికారులను ఆదేశించారు.

ముస్తాబవుతున్న యాదాద్రి

యాదాద్రి దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొండపైన ప్రధాన ఆలయం భక్తుల దర్శనాలకు సిద్ధమైంది. కృష్ణ శిలలతో లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. క్యూలైన్లు భక్తిభావం ఉట్టిపడేలా స్వర్ణకాంతులీనుతోంది. కొండపైన, దిగువన పచ్చదనం పరచుకుని ప్రకృతి సోయగాలు సంతరించుకున్నాయి. భక్తులకు మరపురాని మధురానుభూతి పంచేలా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు. స్వయంభువుల దర్శనాలకు ఇంకా నెలన్నర మాత్రమే మిగిలి ఉండగా చకచకగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణంతో పాటు పచ్చదనం, సుందరీకరణ పనులు నిర్విరామంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనతో మిగిలి ఉన్న పనుల్లోనూ మరింత వేగం పుంజుకోనుంది.

ఇదీ చదవండి:

Last Updated : Feb 7, 2022, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.