అద్భుతంగా, దేశానికి వన్నె తెచ్చే విధంగా తీర్చిదిద్దుతున్న యాదాద్రిషుని ఆలయానికి, ధార్మిక, సాహిత్య, అద్భుత కళాఖండాలను పొందుపరుస్తున్నారు యాడ అధికారులు. యాదాద్రి నారసింహునికి నార వేప మకరతోరణం.. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధానాలయం లోపల గర్భాలయం ద్వారంపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహానికి నార వేప చెక్కతో చేసిన మకరతోరణం అమర్చారు.
గర్భాలయ ముఖద్వారంపై ఇప్పటికే ప్రహ్లాద చరిత్రకు సంబంధించిన ముఖ్య ఘట్టాల ప్రతిమలు ఏర్పాటు చేశారు. వాటి కింది భాగంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి గరుడ వాహనం, శంకుచక్రం, తిరు నామాలను, ఉబ్బెత్తుగా ఆకర్షణీయంగా మలిచారు. గర్భాలయ ముఖ మండపంలోని లక్ష్మి ఆండాళ్ అమ్మవారి ఆలయాల పైకప్పు మీద మహాబలిపురం నుంచి తీసుకొని వచ్చిన సింహం, అష్టలక్ష్మి విగ్రహాలను కళాకారులు పొందుపరుస్తున్నారు. రెండు రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.