యాదాద్రి దివ్యక్షేత్రంలోని పునర్నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శివాలయ ప్రాంగణంలో వేర్వేరుగా హరిహరుల రథశాలల నిర్మాణం ప్రారంభమైంది. ప్రధానాలయం వద్ద యాదాద్రీశుడికి 10 మీటర్ల ఎత్తు, 8 మీటర్ల వెడల్పుతో రథశాల.. శివాలయంలో 8 మీటర్ల ఎత్తు, 5.6 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నట్లు యాడా అధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని వెల్లడించారు.
యాదాద్రికి ఆంధ్రప్రదేశ్ నుంచి భగవంతుని శిలా విగ్రహాలు చేరుకోవడంతో సాలహారాల రూపాలు భక్తజనులకు కనువిందు చేయనున్నాయి. మహావిష్ణువు, దశావతారాలు, అష్టలక్ష్మీ, ఆళ్వారుల విగ్రహాలతో పాటు ఆలయ దేవుడైన మృగ నరహరి రూపాలతో మాడ వీధుల్లోని బాహ్య సాలహారాలను క్షేత్ర స్థాయికి అనుగుణంగా మార్చనున్నట్లు యాడా అధికారులు తెలిపారు.
- ఇదీ చూడండి : నగరాల భవిష్యత్తు.. ఈమె చెబుతుంది!