చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మను మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ అన్నారు.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవటం కోసం మహిళలందరూ కలిసి పోరాటం చేయాలని ఆమె సూచించారు. చాకలి ఐలమ్మ.. భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ ప్రధాన కార్యదర్శి దాసరి మంజుల, ఐద్వా కరకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'కొత్త సచివాలయ నిర్మాణం... సుప్రీం తీర్పునకు విరుద్ధం'