ETV Bharat / state

తెలంగాణ తిరుపతిలో గుప్పుమంటున్న గంజాయి - yadagiri gutta

ఓ వైపు పసిపిల్లలతో వ్యభిచారం, మరోవైపు మనుషుల అక్రమ రవాణాతో అపకీర్తి మూటగట్టుకున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన యాదగిరిగుట్టలో ఇప్పుడు గంజాయి గుప్పుమంటోంది. పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశలో ప్రభుత్వం ముందుకు సాగుతుంటే మరోవైపు గంజాయి దందా విరబూస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా యువతను మత్తులోకి గుంజుతోంది.

గుట్టలో గుప్పుమంటున్న గంజాయి
author img

By

Published : Aug 20, 2019, 4:46 PM IST

గుట్టలో గుప్పుమంటున్న గంజాయి

యాదగిరిగుట్టలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. స్థానికంగా ఉండే యువతతో పాటు యాదాద్రికి వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. యువతకు వీటిని అలవాటు చేస్తున్నది, తరలిస్తున్నది స్థానిక యువకులేనని సమాచారం. నిర్మానుష్య ప్రాంతాలు, పాత వెంచర్లు, చెట్లు, పొదల చాటున గంజాయి తాగుతూ యువత మత్తులో జోగుతోంది.

పక్కా సినీ ఫక్కీలో

సిగరెట్లో పెట్టి పీల్చేందుకు వీలుగా తయారు చేసిన గంజాయిని హైదరాబాద్, భువనగిరి నుంచి రవాణా చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థులు వారికి తెలిసిన వ్యక్తులతో ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్​షాప్​లతో దందాలు కుదుర్చుకుని, కోడ్​ ద్వారా ఎవరికి అనుమానం రాకుండా పక్కా సినీ ఫక్కీలో విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం.

వారే లక్ష్యంగా

శ్రీమంతుల పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు. గంజాయికి బానిసైన వారు ఇంటి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకువెళ్తున్నారు. తల్లిదండ్రులు డబ్బు ఇవ్వకపోతే గొడవ పడుతున్నారు. కొన్నిచోట్ల విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులను హతమారుస్తున్నారు.

త్వరగా స్పందించండి

హైదరాబాద్​ వంటి మహానగరాల్లో ఉండే యువత గంజాయి మత్తుకు బానిస అవుతున్నారని, కానీ ఇప్పుడు తమ ఊర్లోకి ఈ మహమ్మారి ప్రవేశించిందని స్థానికులు వాపోతున్నారు. బిక్షాటన చేసే వారు, కాగితాలు ఏరుకునే వాళ్లతో ఒప్పందం చేసుకుని యువకులకు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇప్పుడిప్పుడే మొదలవుతోన్న ఈ మహమ్మారిని వీలైనంత త్వరగా నియంత్రించాలని పోలీసులను కోరుతున్నారు.

మేం చూసుకుంటాం

ఇప్పటివరకు యాదాద్రిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు గానీ, ఎవరైనా తాగుతున్నట్లు గానీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు.

తెలంగాణ తిరుపతిలో గుప్పుమంటున్న గంజాయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.