ETV Bharat / state

ఏడుపు ఆపట్లేదని.. ఐదేళ్ల చిన్నారికి వాతలు పెట్టిన టీచర్ - అంగన్​వాడీ టీచర్ పైశాచికత్వం

Brutal Behavior of A teacher: ఐదేళ్ల చిన్నారితో ఓ అంగన్​వాడీ టీచర్ పైశాచికంగా ప్రవర్తించింది. ఎంత సముదాయించినా ఏడుపు ఆపడంలేదని గరిటెతో వాతలు పెట్టింది. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

చిన్నారికి వాతలు పెట్టిన టీచర్
చిన్నారికి వాతలు పెట్టిన టీచర్
author img

By

Published : Jan 6, 2022, 10:01 AM IST

Brutal Behavior of A teacher: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో ఓ అంగన్​వాడీ టీచర్ పైశాచికంగా ప్రవర్తించింది. ఎంత సముదాయించినా ఏడుపు ఆపడం లేదని ఐదేళ్ల చిన్నారిపై కర్కశత్వం ప్రదర్శించింది. అభిజ్ఞ అనే చిన్నారి.. గుక్కపెట్టి ఏడ్చింది. చాలాసేపటి వరకు ఏడుపు ఆపలేదు. ఎంత సముదాయించినా.. ఆ పాప ఏడుపు మానట్లేదని అంగన్​వాడీ టీచర్ ఆగ్రహానికి గురైంది. ఆ కోపంలో.. చిన్నారికి గరిటెతో వాతలు పెట్టింది. అభిజ్ఞ.. బుగ్గలు, చేతులు, కాళ్లపై వాతలు పెట్టడంతో నొప్పి తట్టుకోలేక చిన్నారి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది.

తమ కూతురికి అంగన్​వాడీ టీచర్ వాతలు పెట్టిందని తెలుసుకున్న అభిజ్ఞ తల్లిదండ్రులు వెంటనే ఆ కేంద్రానికి పరుగులు తీశారు. ఎర్రగా కందిపోయి ఉన్న తమ కుమార్తెను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. పసిపాపపై పైశాచికత్వం చూపిన ఆ అంగన్​వాడీ టీచర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. టీచర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.