ETV Bharat / state

YADADRI: యాదాద్రి రెండో ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - landslides broken in yadadri bhuvanagiri district

యాదాద్రి రెండో ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

author img

By

Published : Jul 22, 2021, 9:06 AM IST

Updated : Jul 22, 2021, 9:47 AM IST

09:04 July 22

యాదాద్రి రెండో ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విరామం లేకుండా కురుస్తున్న వానలతో యాదాద్రి రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపైకి చేరుకునే రెండో ఘాట్ రోడ్డు మార్గమధ్యలో పక్కనగల కొండరాళ్లు కూలాయి. ఘాట్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేయడం వల్ల, వరుసగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మార్గంలో అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు.

Last Updated : Jul 22, 2021, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.