ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఓ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. భాజపా దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతుందని బండి అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని... న్యాయవాది వామనరావు దంపతుల హత్యకేసులో తెరాస నాయకుల హస్తం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ బ్రోకర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని ఉద్యమాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ మాట ఎత్తడం లేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని భాజపా యువ మోర్చా నాయకులు ఉద్యమాలు చేశారని, లాఠీ దెబ్బలు తిన్నారని గుర్తు చేశారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పేరుతో ప్రతీ ఒక్కరికీ 70 వేలు బాకీ ఉందని బండి అన్నారు. పట్టభద్రుల భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని భారీ ఓటర్లను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి: కేయూ అభివృద్ధిపై తెరాస చిన్నచూపు: ఉత్తమ్