యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేటలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. భాజపా జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్‌తో పాటు కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.