అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయం ముందు భాజపా నేతలు నిరసన చేపట్టారు. పంట నష్టం అంచనా వేసి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను, బాధితులను ఆదుకోవాలని యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండిః కరోనా కాలంలో.. మన విమానాశ్రయాలే భేష్!