BJP Campaigned Munugode bypoll: మునుగోడు ఉపఎన్నిక ప్రచారాన్ని భాజపా నేతలు ముమ్మరం చేశారు. గడప గడపకి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భాజపాను గెలిపించాలంటూ. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కొనేందుకు గులాబీ దళమంతా మునుగోడులో దిగిందని బండి సంజయ్ విమర్శించారు. గులాబీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్న ఆయన ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకనే రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయే వ్యక్తే అయితే ఓడించేందుకు 100 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారని తెరాసను ప్రశ్నించారు. మునుగోడులోనే కాదు రాష్ట్రంమొత్తం భాజపా జెండా ఎగరాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ మునుగోడు మండలం చల్మెడలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. డబ్బులు, ప్రలోభాలతో నేతలను కొనుగోలు చేసి తెరాస గెలవాలని ప్రయత్నిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
ఈ ఎన్నికలు ఎందుకు వచ్చాయో ఒక్కసారి ఆలోచించండి. రాజగోపాల్ రెెడ్డి రాజీనామాతో చౌటుప్పల్ నుంచి నారాయణపురం వరకు రోడ్డు వేశారు. గట్టుపల్ మండలం చేశారు. ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచ్లతో మునుగోడులో తెరాస ప్రచారం నిర్వహిస్తున్నారు. - బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: తెరాస అపరేషన్ ఆకర్ష్.. కమల దళంలో కలవరం