ETV Bharat / state

దొంగల ముఠా ఆటకట్టు.. ఏపీకి చెందినవారిగా గుర్తింపు - యాదాద్రి భువనగిరి జిల్లా

దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు రాచకొండ కమిషనరేట్​ భువనగిరి జోన్​ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. నిందితులు ఏపీ రాజమండ్రి జిల్లాకు చెందినట్లుగా పేర్కొన్నారు.

దొంగల ముఠా ఆటకట్టు.. ఏపీకి చెందినవారిగా గుర్తింపు
దొంగల ముఠా ఆటకట్టు.. ఏపీకి చెందినవారిగా గుర్తింపు
author img

By

Published : Nov 30, 2019, 1:58 PM IST

దొంగల ముఠా ఆటకట్టు.. ఏపీకి చెందినవారిగా గుర్తింపు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పలు మండలాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముఠాను నిన్న వలిగొండ మండలం గోకారం స్టేజీ వద్ద పట్టుకున్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​ రాజమండ్రి జిల్లాకు చెందిన సూరంపూడి వెంకట రమణ భువనగిరిలో కోర్టు ప్రక్కన నర్సరీ నిర్వహిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పటి అందులో పనిచేస్తున్న మరో ఇద్దరితో కలిసి ఈ నేరాలకు పాల్పడినట్లు నారాయణ వెల్లడించారు. వీరిపై గతంలో బీబీనగర్ వలిగొండ మండలాల్లో పలు కేసులు ఉన్నాయన్నారు.

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

TG_NLG_62_29_DCP_PC_AB_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి లో రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. డీసీపీ మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలోని పలు మండలాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముఠాను ఈరోజు వలిగొండ మండలం గోకారం స్టేజీ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా అనుమానాస్పదం గా కనిపించిన ముఠాను వలిగొండ పోలీసులు పట్టుకున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి జిల్లాకు చెందిన సూరంపూడి వెంకట రమణ భువనగిరి లో కోర్టు ప్రక్కన నర్సరీ నిర్వహిస్తు అందులోనే పనిచేస్తున్న మరో ఇద్దరితో కలిసి జల్సాలకు అలవాటు పడి ఈ నేరాలకు పాల్పడట్టు వెల్లడించారు. వీరిపై గతంలో బీబీనగర్ వలిగొండ మండలాల్లో పలు కేసులు ఉన్నాయని డిసిపి పేర్కొన్నారు. వీరు గత మూడు రోజుల క్రితం వలిగొండ మండలం పడమటి వారి గూడెంలో ఓ మహిళ మెడలోంచి పథకం ప్రకారం గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించారు. సదరు మహిళ అరవడంతో అక్కడినుండి పరారు అయ్యారని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. నిందితులను పట్టుకున్న వలిగొండ ఏస్ ఐ హరిప్రసాద్, కానిస్టేబుళ్లు అనిల్, సత్యం గౌడ్ లను డిసిపి నారాయణ రెడ్డి అభినందించి రివార్డు అందించారు. బైట్:నారాయణ రెడ్డి డి సి పి భువనగిరి .
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.