భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం రామలింగంపల్లిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, తుర్కపల్లి మండల కేంద్రంలో సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా పండ్లను పంపిణీ చేశారు. ఆలేరులో పేద మహిళలకు చీరలు అందజేశారు.
తెలంగాణ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ సోనియాగాంధీకి రుణపడి ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీనే మర్చిపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ వస్తే మనం బాగుపడదామని అనుకుంటే కేసీఆర్ కుటుంబం పదవులతో బాగుపడుతుందని విమర్శించారు. సోనియాగాంధీకి పదవులపై ఎలాంటి ఆశలు లేవని.. 2004 , 2009లో పీఎం అవడానికి అవకాశం వచ్చినా ఆమె మన్మోహన్ సింగ్ను నియమించారని గుర్తు చేశారు. మరో రెండేళ్లలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి: దమ్ముంటే రాజీనామా చెయ్.. ఎవరేంటో తెలుస్తది: బాబుమోహన్