ఎల్‌ఆర్‌ఎస్‌ను బేషరతుగా రద్దు చేయాలని... ఇన్ని రోజులు ప్రజలను ఇబ్బందులు పెట్టిన సీఎం కేసీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందన్న ఎంపీ... ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని సూచించారు.
ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతకాలనుకున్న ప్రజలను సీఎం కేసీఆర్... తన తుగ్లక్ పాలనతో సమస్యల వలయంలోకి నెడుతున్నారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడకుంటే... కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని కోమటిరెడ్డి హెచ్చరించారు.