ETV Bharat / state

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అరెస్టు

స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ కార్యాలయం వద్ద కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆందోళనకు దిగారు. ట్రాఫిక్​కు అంతరాయం కలుగుతోందని పోలీసులు కోమటిరెడ్డిని అరెస్టు చేశారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అరెస్టు
author img

By

Published : Aug 30, 2019, 5:34 PM IST

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అరెస్టు

ఐదేళ్లుగా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా కేసీఆర్​.. ప్రజాప్రతినిధులను మోసం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. భువనగిరి జడ్పీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన పార్టీ శ్రేణులకు మద్దతు తెలిపారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేయడం వల్ల ట్రాఫిక్​ స్తంభించింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఎంపీ కోమటిరెడ్డిని అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్​కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుతగలడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో వడపర్తి సర్పంచ్​ ఎలిమినేటి కృష్ణారెడ్డి కాలుకు తీవ్ర గాయమైంది.

Intro:TG_NLG_62_30_KOMATIREDDY_ARREST_AB_TS10061

యాంకర్ : స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు యాదాద్రి భువనగిరి జెడ్పీకార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం ప్రధాన రహదారిపై వారికి మద్దతుగా బైఠాయించి రాస్తా రోకో చేశారు. దీనితో చాలాసేపు భువనగిరి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. Body:ఈసందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ గత ఐదు ఏండ్లు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తూకేసీఆర్ స్థానిక ప్రజా ప్రతినిధులను మోసం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల నిధులు విధుల కోసం పోరాటాల గడ్డ అయిన భువనగిరి నుంచి పోరాటం మొదలుపెట్టామన్నారు.
గ్రామ పంచాయతీ లకు చెక్ పవర్ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు కల్పించి ఇద్దరి మధ్య కేసీఆర్ కొట్లాట పెట్టారని విమర్శించారు.ట్రాఫిక్ కు అంతరాయం కలగటం తో పోలీసులు రంగ ప్రవేశం చేసి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాహనం ఎక్కించే సమయంలో పోలీసు లు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచే సుకుంది. కార్యకర్తలు పోలీస్ వాహనానికి అడ్డు నిలిచారు. పోలీసులు వారిని పక్కకు తపించారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య కోమటి రెడ్డి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. తోపులాటలో వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణా రెడ్డి కాలుకు తీవ్ర గాయం అయ్యింది.

బైట్ : కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి ఎంపీ)Conclusion:రిపోర్టర్ : సతీష్ శ్రీపాద
సెంటర్ : భువనగిరి
జిల్లా : యాదాద్రి భువనగిరి
సెల్ : 8096621425
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.