యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేక రోగులు అనేక అవస్థలు పడుతున్నారు. పాముకాటుతో ఆసుపత్రికి వచ్చిన బాధితులను ప్రథమ చికిత్స చేయకుండా మెరుగైన వైద్యు కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి పంపుతున్నారు. నాలుగు రోజుల క్రితం పాముకాటుతో వస్తే వ్యాక్సిన్ లేదని భువనగిరికి పంపిన ఘటన జరిగి వారం గడవక ముందే... బుజిలాపురానికి చెందిన ఓ రైతు శుక్రవారం పాము కాటుతో వస్తే భువనగిరికి పంపారు.
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురానికి చెందిన బీసు రవి ఈ రోజు ఉదయం పాముకాటుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. సమయానికి డ్యూటీ డాక్టర్ లేనందున స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్టు ప్రథమ చికిత్స చేసి, వ్యాక్సిన్ ఇచ్చి భువనగిరికి పంపారు. తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా... వైద్యులు అందుబాటులో ఉండకపోవటం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 24 గంటలు వైద్య సేవలు అందేటట్లు చూడాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం