యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామం నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు ఇసుక తరలింపు నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఇసుక తవ్వకాల అనుమతిని రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే రెండు దఫాలుగా కాంట్రాక్టర్లు ఇసుకను తరలించారని తెలిపారు. 30 అడుగుల ఎత్తులో ఉన్న ఇసుక ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందని వాపోయారు. ఇసుక తరలింపు వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయి.. తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాల ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రమేష్‌కు గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!