ETV Bharat / state

యాదాద్రి, వేములవాడలో దర్శనానికి ఏర్పాట్లు - యాదాద్రి జిల్లా తాజా వార్తలు

ఈ నెల 8 నుంచి దేవాలయాల్లో ప్రవేశాలకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని అనుసరిస్తూ భక్తుల దర్శనాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ఆలయంలో భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లలో సర్కిల్స్​ ఏర్పాటు చేశారు. . ఆలయ సన్నిధిలో ఉన్న రెండు సముదాయాల్లో 140 మంది భక్తులు వేచి ఉండేలా గడులు సిద్ధం చేయడంతోపాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

యాదాద్రి, వేములవాడలో దర్శనానికి ఏర్పాట్లు
యాదాద్రి, వేములవాడలో దర్శనానికి ఏర్పాట్లు
author img

By

Published : Jun 5, 2020, 6:56 AM IST

దేవాలయాల్లో ప్రవేశాలకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను అనుసరించి యాదాద్రిలో దర్శనాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 8 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తూ... భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లలో సర్కిల్స్ ఏర్పాటు చేశారు. ధర్మదర్శనాల సముదాయంలో మూడు అడుగుల దూరం ఉండేలా గడులు గీశారు. ఆలయ సన్నిధిలోని రెండు సముదాయాల్లో 140 మంది భక్తులు వేచి ఉండేలా గడులు సిద్ధం చేయడంతోపాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులను దైవదర్శనానికి అనుమతించరని తెలుస్తోంది.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు క్యూలైన్లలో పరిశుభ్రత పాటించేందుకు సిబ్బందికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో శానిటైజేషన్ చేసుకునేందుకు, చేతులు శుభ్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులను ఎప్పటికప్పుడు థర్మల్ స్కానింగ్ యంత్రాలతో పరీక్షలు చేసి, శానిటైజేషన్ చేసిన తర్వాతే అనుమతించనున్నారు.

నిత్యం అభిషేకాలు, దర్శనాలు, ఆర్జిత సేవలు, ధర్మగుండంలో స్నానాలు చేయడం వంటి సేవలపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ప్రస్తుతం భక్తులు ఆన్‌లైన్ ద్వారా సేవలను బుక్ చేసుకోగా, అర్చకులు వారి పేరిట పూజలు నిర్వహిస్తున్నారు.

ఇవీచూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.