యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం శివారులోని వాగులో 4కోట్ల వ్యయంతో చెక్‌డ్యాం నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే దంపతుల ఫ్లెక్సీకి తెరాస నేతలు క్షీరాభిషేకం చేశారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ ఛైర్మన్ మహేందర్ రెడ్డిల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
గ్రామాల్లో జలమట్టం పెరిగేందుకు అవకాశం ఉంటుందని ఎంపీపీ గోపగాని బాలమణి అన్నారు. రానున్న రోజుల్లో గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతం జలకళ సంతరించుకోవాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దంపతులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు చామకూర గోపాల్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, మదర్ డైరీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు..
ఇవీ చూడండి: కేసీఆర్‌కు ప్రజా సంక్షేమం కంటే ఆర్థిక లావాదేవీలే ముఖ్యం : భట్టి