ETV Bharat / state

యాదాద్రిలో ఘనంగా ఎదుర్కోలు మహోత్సవం.. నేడే స్వామి వారి కల్యాణం - Kalyanam in Yadadri

Yadadri Brahmotsavam: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదాద్రిలో ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నర్సింహమూర్తి, మరికొంత మంది అర్చకులు పెళ్లిపెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరోవైపు మంగళవారం జరిగే స్వామి, అమ్మవార్ల కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Yadadri Brahmotsavam
Yadadri Brahmotsavam
author img

By

Published : Feb 27, 2023, 10:35 PM IST

Updated : Feb 28, 2023, 6:39 AM IST

యాదాద్రిలో ఘనంగా ఎదుర్కోలు మహోత్సవం

Yadadri Brahmotsavam: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోలు స్వామి అమ్మ వార్లను ప్రత్యేక అలంకారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగించి తూర్పు రాజ గోపురం ముందు ఎదురెదురుగా అధిష్టింపజేసి ఎదుర్కోలు తంతును వైభవంగా నిర్వహించారు.

అర్చకులు.. స్వామివారి తరపున ఆలయ ఈవో.. గీతారెడ్డి, అర్చకులు అమ్మవారి తరఫున ఆలయ ఛైర్మన్ నర్సింహమూర్తి, మరి కొంత మంది అర్చకులు పెళ్లిపెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతును నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా ఇరువర్గాల మధ్య వాదసంవాదాల మధ్య ఎదుర్కోలు కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ఒప్పందాలు, చర్చల అనంతరం స్వామివారు మాకు నచ్చారని అమ్మవారి తరపున, అమ్మవారు మాకు కూడా నచ్చారని స్వామి తరపున పెద్దలు అంగీకరించడంతో ఎదుర్కోలు కార్యక్రమం ముగిసింది.

Sri Lakshminarasimha swami kalyanam: అనంతరం వేదపండితులు స్వామిఅమ్మవార్ల కల్యాణం కోసం తులాలగ్నం మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆలయ మాడవీధిలో నృసింహ వైభవ తిరుకల్యాణోత్సవం మంగళవారం రాత్రి 8గంటలకు సుముహూర్తం నిర్ణయించారు. ఇరు వర్గాలవారు దీనికి ఒప్పకొని నిశ్చయ తాంబూలాలు మార్చకోవడంతో ఎదుర్కోలు తంతు ముగిసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నర్సింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, జడ్పీటీసీ తోటకూరి అనురాధ-బీరయ్య, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కల్యాణానికి భారీ బందోబస్తు: మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. మంగళవారం సాయంత్రం నిర్వహించే స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారికి ప్రభుత్వం తరపున పలువురు మంత్రులు, పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. స్వామివారి కల్యాణం సందర్భంగా ఆలయ ప్రాగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 350 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు.

స్వామి వారి కల్యాణం కొండపైన ఆలయ పునర్నిర్మానం అనంతరం నూతనంగా నిర్మించిన బ్రహ్మోత్సవ మండపంలో జరగనున్నాయి. మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి దాదాపు 10 వేల మంది భక్తులు కల్యాణాన్ని తిలకించేలా సిద్ధం చేస్తున్నారు. వీఐపీలు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మీడియా కవరేజీ కోసం ప్రత్యేక గ్యాలరీ సిద్ధం చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలుగుకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

యాదాద్రిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు.. పాల్గొన్న ప్రముఖులు

యాదాద్రిలో 'మెట్ల మెట్టుకు పతనర్తనం'.. కూచిపూడి నృత్యంతో అలరించిన చిన్నారులు

ఆలయ నగరిగా రూపుదిద్దుకుంటోన్న ‘యాదరుషి నిలయం’.. మనమూ చూద్దామా..!

Last Updated : Feb 28, 2023, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.