ETV Bharat / state

Allu Arjun fans attack on theatre owner: 'మేము లోకల్స్.. మాకు పుష్ప టికెట్లు ఇవ్వరా?'

Allu Arjun fans attack on theatre owner : 'పుష్ప' సినిమా అభిమానుల అత్యుత్సాహం కారణంగా.. భువనగిరి పట్టణంలోని ఓంకార్ సినిమా థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సినిమా టికెట్ల కోసం బన్నీ అభిమానులు ఏకంగా థియేటర్ యజమానిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మేనేజర్ రూమ్​లోని ఫర్నిచర్ ధ్వంసం చేసి... గ్లాస్ డోర్​ని పగలగొట్టారు.

Allu Arjun fans attack on theatre owner, bunny fans attack
థియేటర్ ఓనర్​పై అల్లు అర్జున్ అభిమానుల దాడి
author img

By

Published : Dec 18, 2021, 4:52 PM IST

Allu Arjun fans attack on theatre owner : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓంకార్ థియేటర్​లో 'పుష్ప' సినిమా టికెట్ల కోసం ఘర్షణ జరిగింది. లోకల్ వాళ్లకు టికెట్స్ ఇవ్వరా అంటూ స్థానిక యువకులు థియేటర్ యాజమాన్యంపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. థియేటర్ లీజుకు తీసుకున్న లింగం యాదవ్​పై అల్లు అర్జున్ అభిమానులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మేనేజర్ రూమ్​లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గ్లాస్ డోర్​ని పగలగొట్టారు.

గోల్డ్ చైన్ మాయం

ఈ ఘటనలో థియేటర్ యజమాని లింగం యాదవ్ మెడలో ఉన్న 4 తులాల బంగారు చైన్, మేనేజర్ రూమ్​లో ఉన్న రూ.40 వేల నగదు, రూ.20 వేల విలువ గల పుష్ప సినిమా టికెట్లు, సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్, మానిటర్​ని ధ్వంసం చేసి ఎత్తుకెళ్లినట్లు లింగం యాదవ్ తెలిపారు. ఈ ఘటనలో గాయాలపాలైన ఓనర్... పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

దుమ్మురేపిన కలెక్షన్లు

అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన 'పుష్ప' చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం, బన్నీ నటన, సినిమాటోగ్రఫీతో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్​గా మారాయి. సమంత స్పెషల్ సాంగ్ కూడా థియేటర్లకు జనాల్ని రప్పించడంలో సఫలమైంది. దీంతో తొలిరోజే కలెక్షన్ల పరంగా దుమ్మురేపిందీ చిత్రం.

నైజాంలో కలెక్షన్లు

నైజాం ఏరియాలో ఏకంగా తొలిరోజే రూ.11.44 కోట్ల షేర్​తో ఆల్​టైమ్ రికార్డు సృష్టించింది 'పుష్ప'. ఈ విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం, ఐదో షోకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపు భారీ కలెక్షన్లకు దోహదం చేశాయి.

తమిళనాడులో వసూళ్లు

అలాగే తమిళనాడులో తొలిరోజు ఈ చిత్రానికి రూ.3.75 కోట్ల గ్రాస్ లభించిందని తెలుస్తోంది. కేరళలో రూ.2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. సరైన ప్రమోషన్లు లేకపోయినా ఓ డబ్బింగ్ సినిమాకు ఇంతటి కలెక్షన్లు రావడం అద్భుతమనే చెప్పవచ్చు.

బాలీవుడ్​లో కలెక్షన్స్

అల్లు అర్జున్ 'పుష్ప'పై బాలీవుడ్​లో మంచి హైప్ ఏర్పడింది. దానికి కారణం బన్నీ నుంచి వచ్చిన చాలా చిత్రాలు యూట్యూబ్​లో దుమ్మురేపాయి. కానీ బన్నీ చిత్రాలు హిందీలో డబ్ కావడం ఇదే తొలిసారి. ప్రమోషన్స్ సరిగా లేకపోయినా, థియేటర్ల సీటింగ్ సామర్థ్యం 50 శాతమే ఉన్నా.. అక్కడ కూడా ప్రేక్షకుల్ని మెప్పించడంలో సఫలమయ్యారు సుక్కు-బన్నీ. దీంతో తొలిరోజే ఈ చిత్రానికి అక్కడ రూ.3.1 కోట్లు వసూళ్లు రావడం విశేషం. శని, ఆదివారాల్లో ఈ కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని అంచనా.

ఇదీ చదవండి: Pushpa Review: 'మాస్​ సినిమాకు సరికొత్త డెఫినిషన్​ 'పుష్ప''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.