ETV Bharat / state

Bikshamaiah Goud Joins BJP: తెరాసకు షాక్... భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే

author img

By

Published : Apr 5, 2022, 9:52 AM IST

Bikshamaiah Goud Joins BJP: తెరాస నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌ భాజపాలో చేరారు. తరుణ్‌చుగ్‌ సమక్షంలో బూడిద భిక్షమయ్య గౌడ్ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే భాజపాలో చేరుతున్నట్లు భిక్షమయ్య పేర్కొన్నారు.

Bikshamaiah Goud Joins BJP
తెరాసకు షాక్... భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే

Bikshamaiah Goud Joins BJP: ఆలేరు మాజీ ఎమ్మెల్యే, తెరాస నేత భిక్షమయ్య గౌడ్‌ భాజపాలో చేరారు. భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్‌... కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న భిక్షమ‌య్య గౌడ్.. 2018లో తెరాసలో చేరారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తెరాసలో చేరానని... కానీ ప్రజల్లోకి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని ఆరోపించారు. ఆలేరు ప్రజల నుంచి తనను వేరుచేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే భాజపాలో చేరుతున్నట్లు భిక్షమయ్య పేర్కొన్నారు.

‘‘ఆలేరు అభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చేందుకు 2018లో తెరాసలో చేరా. అభివృద్ధిలో నన్ను భాగస్వామిని చేస్తారని భావించా. ఇక్కడి ప్రజలు, నన్ను వేరు చేసేందుకు కుట్ర చేశారు. ఇక్కడ తిరగొద్దని.. ప్రజలను కలవొద్దని తెరాస పెద్దలు ఆదేశించారు. మూడేళ్లుగా ఆలేరు ప్రజలను కలవకుండా కట్టడి చేశారు. ప్రజల నుంచి దూరం చేయాలన్న కుట్రను నేను ఛేదించాను. ఆలేరు ప్రజలకు సేవ చేసేందుకే భాజపాలో చేరుతున్నా’’ -భిక్షమయ్య గౌడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.