ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన దివ్యాంగులతో కూర్చొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు దివ్యాంగులు మొదట మర్యాదపూర్వకంగా పూల బొకేలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడేలా పరీక్ష ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. వారిని అభినందించి... ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆయా సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసానిచ్చారు. అందరు దివ్యాంగులు కావడం వల్ల వారితోనే కింద కూర్చొని క్యాలెండర్ను ఆవిష్కరించి వారి మనసు గెలుచుకున్నారు.
ఇదీ చూడండి : సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు