యాదాద్రిలో ప్రెసిడెంట్ సూటు నిర్మిస్తుండగా శ్లాబ్ కూలిన ప్రాంతాన్ని స్థానిక భాజపా, కాంగ్రెస్ నాయకులు విడివిడిగా పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన కూలీలకు పరిహారం చెల్లించాలని కోరారు. ఇటువంటి ఘటనలు మరొకసారి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
బుధవారం స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.