యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య అనే రైతు తన మూడెకరాల భూమిని ప్రొసిడింగ్ చేయాలని వీఆర్వోను కోరగా... ఎకరానికి 20వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేని ఆ రైతు అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గ్రామ వీఆర్వో శ్రీను అతనికి సహకరించిన వీఆర్ఏ యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 42 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
- ఇదీ చూడండి : విజ్ఞప్తులు పట్టించుకోలేదు... పైసా విదల్చలేదు...