ETV Bharat / state

ACB Caught PanchayatRaj AE : అనిశా వలలో మరో అవినీతి చేప.. లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ పంచాయతీరాజ్​ ఏఈ

ACB Caught PanchayatRaj AE in Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ పంచాయతీ కార్యాలయంలో ఏఈ ఉద్యోగి రూ.80 వేలు లంచం తీసుకుంటూ.. అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. బాధితుడ్ని, తోటి ఉద్యోగులను విచారించి.. ఇవాళ హైదరాబాద్​లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఎవరైనా ఉద్యోగులు లంచం అడిగితే తమకు తెలియజేయాలని నల్గొండ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Nalgonda DSP Reaction in AE Bribe Case
ACB Caught AE in Yadadri Bhuvanagiri District
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 10:40 AM IST

ACB Caught PanchayatRaj AE in Yadadri Bhuvanagiri : సమాజంలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ.. జీతమే కాకుండా.. మరింత ఎక్కువ డబ్బులు పొందాలనే ఆశతో కొంత మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. వారి స్థాయికి అనుగుణంగా ప్రజల నుంచి లంచం రూపంలో దోచుకుంటున్నారు. తాజాగా లంచం డిమాండ్​ చేస్తున్నారంటూ ఓ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ(అనిశా)ను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పథంకం వేసి.. లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

Nalgonda DSP Reaction in AE Bribe Case : నల్గొండ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేటకు చెందిన శ్రీశైలం అనే గుత్తేదారు గ్రామంలో ప్రభుత్వ నిధులతో సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులు చేశారు. దీనికి సంబంధించిన రూ.16 లక్షల బిల్లులకు ఎంబీ రికార్డు చేయడానికి ఏఈ రమేశ్​ కుమార్ రూ.80 వేలు లంచం ఇవ్వాలని మూడు నెలలుగా తిప్పించుకుంటున్నాడు. విసుగు చెందిన శ్రీశైలం ఏసీబీ అధికారుల(ACB officials)ను ఆశ్రయించారు. ఈ అంశంపై పోలీసులు స్పందించి.. పథక రచన చేశారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో శ్రీశైలం ఎప్పటిలాగానే.. మండల పరిషత్తు కార్యాలయంలోని ఏఈ రమేశ్​ కుమార్​ (AE RAMESH Kumar)ఛాంబర్​కు వెళ్లాడు. నమ్మకంగా మాట్లాడుతూ.. రూ.80 వేలు ఇచ్చాడు. అనంతరం నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు కలసి కార్యాలయ భవనం నుంచి బయటకు వచ్చారు. రమేశ్​ కుమార్ తన కారు తలుపులు తీస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా చుట్టుముట్టారు.

ACB caught Sub registrar: రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్

ACB Caught AE Ramesh Kumar at Sarajipet in Aleru : ఆ ఉద్యోగి దగ్గర ఉన్న నగదును స్వాధీనం చేసుకుని.. కలరింగ్ పరీక్షలు నిర్వహించారు. పట్టుబడిన నగదు లంచమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాలుగు గంటల పాటు విచారించారు. ఇదే సమయంలో హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు, శారాజీపేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి స్వప్నను ఏసీబీ అధికారులు మండల పరిషత్ కార్యాలయానికి పిలిపించి.. గుత్తేదారు చేసిన వివరాలను సేకరించారు. నిందితుడ్ని మరింత లోతుగా విచారించి.. ఇవాళ హైదరబాద్​లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

"ఆలేరు పంచాయతీ ఉద్యోగి ఏఈ రమేశ్​ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. శ్రీశైలం అనే కాంట్రాక్టర్​ రోడ్లు వేసి బిల్లు కోసం వెళితే.. రమేశ్​ అనే ఉద్యోగి రూ.80 వేలు లంచం అడిగాడు. ఇది జరిగి 3 నెలలు అయింది. ఈ క్రమంలోనే ఎంబీ రికార్డు చేయమని అడగ్గా లంచం అడిగాడని.. ఈ నెల 5న అనిశా అధికారులను కలిశాడు. దీంతో ఆ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. అతను తీసుకున్న డబ్బును కలర్ టెస్ట్​ చేస్తే లంచం తీసుకున్నాడని నిర్ధారించుకున్నాం. అనంతరం రిమాండ్​కి పంపించాం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే మాకు తెలియజేయాలని కోరుతున్నాం."- శ్రీనివాసరావు, నల్గొండ ఏసీబీ డీఎస్పీ

ACB Caught PanchayatRaj AE అనిశా వలలో మరో అవినీతి చేప లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ పంచాయతీరాజ్​ ఏఈ

అధికారులను చూసి షాక్​.. లంచం డబ్బులు మింగేసిన రెవెన్యూ ఉద్యోగి.. ఆఖరికి..

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బహదూర్​పురా ఎస్సై

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.