యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీనిలో ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ అనురాధ వివిధ గ్రామాల సర్పంచ్లు స్థానిక, ప్రజా ప్రతినిధులు.. తహసీల్దార్, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాగా భూ సమస్యపై మల్లాపురం గ్రామ సర్పంచ్ కర్రె వెంకటయ్య సమావేశంలో నిరసన తెలిపారు. గ్రామంలో కొందరు కాంగ్రెస్ నాయకులు నిరుపేదల భూములను అక్రమంగా కబ్జా చేశారని సర్పంచ్ వెంకటయ్య ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోడియం వద్ద బైఠాయించారు.
ఇదీ చూడండి: 'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'