యాదాద్రి క్షేత్రాన్ని మౌలిక వసతులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే క్రమంలో అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. ఈ క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి పరిచే క్రమంలో... యాడా సేకరించి, కొనుగోలు చేసిన స్థలంలోని గండిచెరువు వద్ద గల 6 ఎకరాల భూమిలో బస్‌స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు.
సకల హంగులతో భక్తులకు అనువైన బస్టాండ్ నిర్మించేందుకు ఈ భూమిని ఆర్టీసీకి అప్పగించనున్నారు. మల్లాపురం శివారులో డిపో కోసం ఇప్పటికే పది ఎకరాలు కేటాయించారు. సీఎంవో భూపాల్ రెడ్డి ఆదేశాలతో స్థలం అప్పగించే తతంగానికి రంగం సిద్ధమైంది.
![6 acres place given to yadadri bus stand](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-29-yadadri-rtc-ki-sthalam-appagintha-av-ts10134_29012021084440_2901f_1611890080_7.jpg)
కొండపై వేగంగా పనులు...
యాదాద్రిలో జరుగుతున్న నిర్మాణ పనులు మరింత చురుకుగా సాగుతున్నాయి. కొండపై చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించగా... హరిహరుల ఆలయాలకు చెందిన కట్టడాలు ముమ్మరమయ్యాయి.
![6 acres place given to yadadri bus stand](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-29-yadadri-rtc-ki-sthalam-appagintha-av-ts10134_29012021084440_2901f_1611890080_718.jpg)
శివాలయ పునర్ నిర్మాణంలో ఉపఆలయాలకు సంప్రదాయంగా హంగులద్దుతున్నారు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే భక్తుల కోసం కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో దర్శన వరుసల ఏర్పాట్లు పూర్తి కాగా... ఆ కింది ఫ్లోర్లో గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
![6 acres place given to yadadri bus stand](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-29-yadadri-rtc-ki-sthalam-appagintha-av-ts10134_29012021084440_2901f_1611890080_337.jpg)