ETV Bharat / state

మీరు పన్ను కట్టాల్సిన రోజొకటి ఉంది జాగ్రత్త!

మనసుంటే మార్గంముంటుంది.. అనే సామెతను వరంగల్​ నగర పాలక సంస్థ నిబద్ధతతో అమలు చేస్తోంది. ఇదే నా మాట.. నా మాటే శాసనం, ఎవరైతే పన్ను కడతారో వారే నగర పౌరులు.. ఇదేంటి సినిమా డైలాగులు అనుకుంటున్నారా.. అవును మీరు చూసింది నిజమే. పన్ను కట్టాలని ఈ నగర పాలకసంస్థ సినిమా డైలాగులతో కూడిన బోర్డులను రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. వినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పన్ను కట్టండి ఆఫర్​ ఉందంటూ తెలియపరుస్తున్నారు.

author img

By

Published : May 15, 2020, 4:14 PM IST

you need to pay taxes on government advertisement at warangal
మీరు పన్ను కట్టాల్సిన రోజొకటి ఉంది జాగ్రత్త!
మీరు పన్ను కట్టాల్సిన రోజొకటి ఉంది జాగ్రత్త!

వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు వినూత్నంగా పన్నులను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో రమ్య కృష్ణ డైలాగుకు ఓ బోర్డును ఏర్పాటు చేశారు. అంతేకాదు భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి.. ఎవరైతే పన్ను కడతారో వారే వరంగల్ అభివృద్ధిని కాంక్షిస్తారంటూ మరో ఫ్లెక్సిని తయారు చేయించారు. పన్ను కట్టండి ఆఫర్​ పొందడి అంటూ ఉన్న ఆ ప్రకటనలు నగరవాసులను ఆలోచింప జేస్తున్నాయి.

కూడళ్ల వద్ద బోర్డులు..

ఈనెల 31 వరకు గడువు విధిస్తూ అధికారులు ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లించాలంటూ వరంగల్ నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద అలాంటి బోర్డులను ఉంచారు. నిన్నటి వరకు బడా బకాయిదారుల బోర్డులను ఏర్పాటుచేసిన నగర పాలక సంస్థ... ఇప్పడు పన్ను రాబట్టేందుకు బాహుబలి, భరత్ అనే నేను మూవీ డైలాగుల సినిమా పాత్రలతో రంగంలోకి దిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఆ ప్రకటన బోర్డులు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చూడండి : గోదావరి జలాలపై సీఎం దృష్టి.. 17న ప్రత్యేక భేటీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.