పక్కదారి పడుతున్న ట్యాంకర్లు
మున్సిపాలిటీ వారు సరఫరా చేసే ట్యాంకర్లను సిబ్బంది నగదుకు ఆశపడి బయటివారికి అమ్మకుంటున్నారని ఆరోపించారు. తమ గోడు ఎన్ని సార్లు విన్నవించినా హామీలే తప్ప చేతల్లో కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్తంభించిన ట్రాఫిక్ తరలివచ్చిన పోలీసులు
మహిళల నిరసనతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వారికి సర్దిచెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. చేసేదేమీ లేక మహిళలను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి ట్రాఫిక్ పునరుద్ధరించారు.
ఇదీ చదవండి:నిట్‌లో ర్యాగింగ్... ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్