వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం అంబాలలో గాలీవాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా భారీగాలులు వీయటం వల్ల గ్రామీణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. చెట్లు నేలకూలాయి. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవటం వల్ల ఇంట్లోని వస్తువులన్నీ తడిచిముద్దయ్యాయి. గృహోపకరణాలు కాలిపోయాయి.
ప్రాణాలు అరచేతపట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడిపామని గ్రామస్థురాలైన రజిత పేర్కొంది. విద్యుత్తు తీగలు తెగిపడ్డాయని.. విద్యుత్తు సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పింది. అధికారులు స్పందించి తమను కాపాడాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: దిగ్బంధంలో హైదరాబాద్.. నిలిచిన రాకపోకలు..