అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే అధిష్టానం వరంగల్ మేయర్‌ను ఎంపిక చేస్తుందని తెరాస ప్రధాన కార్యదర్శి బాలమల్లు తెలిపారు. అధిష్టానం అదేశాల మేరకు బాలమల్లు హన్మకొండలో వరంగల్ మేయర్ ఎంపికపై ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, రమేష్, రాజయ్య, నరేందర్‌తో కలిసి సమావేశమయ్యారు.
ఎమ్మెల్యేలు, కార్పోరేటర్ల అభిప్రాయాలను తీసుకుని అధిష్టానం వద్దకు తీసుకెళ్తానని బాలమల్లు చెప్పారు. మోజార్టీ అభిప్రాయం మేరకు ఎల్లుండి కౌన్సిలింగ్ సమావేశంలో మేయర్ పేరు ప్రకటిస్తామని పేర్కొన్నారు.
