ఇటీవల వరంగల్ వరద, ముంపు, తెగిన చెరువులు, రోడ్లు, కూలిన ఇళ్లు పంటల నష్టాలు, కరోనా కట్టడి చర్యలపై సీఎస్‌తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశమయ్యారు. వరదల వల్ల నష్టపోయిన వారికి పరిహారం అందించేలా కృషి చేయాలని కోరారు.
వరంగల్ నగరానికి వరదలు, ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కట్టడి కొరకు ప్రభుత్వ ఆసుపత్రులకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని మంత్రి సీఎస్‌కు సూచించారు.
ఇవీ చూడండి: ఈటీవీ రజతోత్సవ వేళ.. తారల శుభాకాంక్షల వెల్లువ