తెరాస ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... ప్రజా ప్రతినిధులకు చెప్పులతో స్వాగతం పలకాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ వరంగల్ పట్టణ కేంద్రంలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట స్థిరాస్తి వ్యాపారులు నిరాహార దీక్ష చేపట్టారు. వారి దీక్షకు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు పలికాయి.
తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'జనవరి తొలివారం నుంచి ఉచిత తాగునీటి సరఫరా'